'ప్రతి విద్యార్థి దేశభక్తి చాటుకోవాలి'

'ప్రతి విద్యార్థి దేశభక్తి చాటుకోవాలి'

BPT: భారత జాతీయ పతాకాన్ని ప్రతి భారతీయుడి ఇంటిపై ఎగరవేసి దేశభక్తిని, జాతీయ సమైక్యతను చాటాలని ఏల్చూరు పాఠశాల హెచ్ఎం మాధవి తెలిపారు. గురువారం సంతమాగులూరు మండలంలోని ఏల్చూరు పాఠశాలలో జాతీయ జెండాతో హర్ ఘర్ తిరంగ ర్యాలీని చేపట్టారు.. ఈ ప్రదర్శన వలన యువతకు విద్యార్థులకు దేశంపై భక్తి భావన కలుగుతుందని అభిప్రాయపడ్డారు. సూపర్వైజర్ ప్రమీల, తదితరులు, విద్యార్థులు పాల్గొన్నారు