మృత్యువు నుంచి క్షణాల్లో బయటపడిన మొజ్తాబా
అమెరికా దాడి నుంచి ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ త్రుటిలో తప్పించుకున్నట్లు తెలుస్తోంది. వీరి భవనాన్ని క్షిపణులు తాకడానికి కొన్ని క్షణాల ముందే మొజ్తాబా అక్కడినుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ మేరకు 'ది టెలిగ్రాఫ్' కథనం వెల్లడించింది. అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో కనీసం మూడు క్షిపణులు ఈ భవనాన్ని తాకినట్లు తెలిసింది.