శిశు మరణాలకు ప్రధాన కారణం ప్రీ టెర్మ్ జననాలు
ASR: ప్రీ టెర్మ్ జననాలు శిశు మరణాలకు ప్రధాన కారణమని డీఎంహెచ్‌వో డాక్టర్ డీ. కృష్ణమూర్తి నాయక్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారిణి డాక్టర్ సీహెచ్ కమల కుమారి తెలిపారు. ప్రీ మెచ్యూర్ శిశువుల ఆరోగ్య సమస్యలు, చికిత్సలపై ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్యాధికారులకు సూచించారు. సోమవారం పాడేరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రపంచ అకాల జనన దినోత్సవం బ్యానర్లను ఆవిష్కరించారు.