పూలే విగ్రహం ఏర్పాటు చేయాలి: శ్రీనివాస్

MNCL: రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతీబా పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్రానికి ముందే కులవివక్ష, అంటరానితనం, మూడ నమ్మకాల నిర్మూలనకు పూలే పోరాడారని తెలిపారు.