VIDEO: భారీ వర్షం బీభత్సం..పంటలకు నష్టం, రైతుల్లో ఆందోళన

VIDEO: భారీ వర్షం బీభత్సం..పంటలకు నష్టం, రైతుల్లో ఆందోళన

జనగామ జిల్లాలో ఇవాళ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. గాలిదుమారానికి జనజీవనం అతలాకుతలమవగా, పలు మండలాల్లో చేతికొచ్చిన వరి పంట నేలవాలింది. మామిడి, చింతకాయలు రాలిపోవడంతో రైతులకు అపార నష్టం వాటిల్లింది. వ్యవసాయ మార్కెట్‌లో ఆరబెట్టిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. ప్రకృతి ప్రకోపంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.