రెండు వర్గాల ఘర్షణలో గర్భిణీకి గాయాలు
కోనసీమ: అంబాజీపేట మండలం మాచవరంలో మంగళవారం జరిగిన రెండు వర్గాల మధ్య ఘర్షణలో ఒక గర్భిణీకి గాయాలయ్యాయని స్థానికులు ఆరోపించారు. బాధితురాలిని వెంటనే అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అంబేద్కర్ జయంతి కార్యక్రమానికి విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణను ఒక వర్గం వారు అడ్డుకోవడంతో రెండు వర్గాల మధ్య తోపులాటలో ఆమె కింద పడిందని స్థానికులు తెలిపారు.