‘హమాస్ నాయకులను చంపితే శాంతి వస్తుంది’

ఖతార్ రాజధాని దోహాలో హమాస్ ముఖ్య నేతలను చంపడం ద్వారా శాంతిని సాధించవచ్చని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు. దోహాలోని హమాస్ నాయకులు కాల్పుల విరమణ ఒప్పందాలను అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. సెప్టెంబర్ 9న దోహాలో హమాస్ నాయకులపై ఇజ్రాయెల్ దాడులు నిర్వహించింది. ఈ దాడుల వల్ల గాజాలో ఘర్షణ ముగిసి, ఇజ్రాయెల్ బందీలు తిరిగి వచ్చేందుకు మార్గం సుగమం అవుతుందని నెతన్యాహు అభిప్రాయపడ్డారు.