విద్యుత్ షాక్‌తో నాలుగు పాడి గేదెలు మృతి

KMM: ముదిగొండ మండలం ఎడవల్లి గ్రామంలో రాత్రి గాలి వాన బీభత్సానికి వ్యవసాయ పొలాల్లో విద్యుత్ వైర్లు కింద పడ్డాయి. శుక్రవారం నాలుగు పాడి గేదెలు మేత కోసం గ్రామ శివారులోకి వెళ్లాయి. మేత మేస్తుండగా వైర్లను తాకటంతో అక్కడిక్కడే మృతి చెందాయి. దీంతో తమకు రూ.2.5లక్షల నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధిత రైతు కోరారు.