'పోలీసులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి'
KDP: కడపలోని జిల్లా పోలీస్ సంక్షేమ ఆస్పత్రిలో ఇవాళ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఆ శిబిరాన్ని ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నరు. కాగా, గుండె, నరాల, చర్మ, ఆర్థో వంటి వివిధ రకాల పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు, పలువురు వైద్యులు పాల్గొన్నారు.