వరంగల్‌లో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్

వరంగల్: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆదివారం మిల్స్ కాలనీలో సీఐ మల్లయ్య, స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లలను పిలచి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఎలాంటి చట్ట విరుద్ధమైన పనులు చేయవద్దని, ప్రజలను భయ బ్రాంతులకు గురి చేయవద్దని, ప్రతిరోజు స్టేషన్‌కు వచ్చి హాజరు వేసుకోవాలని, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.