'ఎస్సీ కార్పొరేషన్ రుణాల్లో దివ్యాంగులకు 5 శాతం కేటాయించాలి'

'ఎస్సీ కార్పొరేషన్ రుణాల్లో దివ్యాంగులకు 5 శాతం కేటాయించాలి'

BHNG: ఎస్సీ కార్పొరేషన్ నిరుద్యోగ యువతకు రుణాల మంజూరులో వికలాంగులకు ఎలాంటి రిజర్వేషన్ కల్పించలేదని ఎన్‌పీఆర్‌డీ జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ అన్నారు. వెంటనే 5 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శనివారం భువనగిరి పట్టణంలోని సుందరయ్య భవన్‌లో నిర్వహించిన NPRD సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.