అడ్వాన్స్ టెక్నాలజీని వినియోగించుకోవాలి: కలెక్టర్

SDPT: పదో తరగతి పాసైన విద్యార్థులు ఇంటర్మీడియట్‌లో అడ్వాన్స్ టెక్నాలజీ కోర్సును వినియోగించుకోవాలని కలెక్టర్ హైమావతి సూచించారు. గురువారం కుకునూర్ పల్లిలో ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్‌ను ఆమె సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న ITIలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. భవిష్యత్‌లో మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు.