కోస్తా, రాయలసీమకు భారీ వర్ష సూచన
AP: నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరంలో 'దిత్వాహ్' తుఫాన్ కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తుఫాన్ ప్రభావంతో శని, ఆది, సోమవారాల్లో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రజలు అత్యవసర సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థ టోల్ ఫ్రీ నెంబర్లు 1070, 112, 1800 4250 101కు సంప్రదించాలని విజ్ఞప్తి చేసింది.