తాండూరులో కలుషిత నీరు
VKB: తాండూరు పట్టణంలోని పాత కూరగాయల మార్కెట్ ప్రాంతంలో కలుషిత నీరు సరఫరా అవుతుండటంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీ పైప్ లైన్ ఎక్కడో లీకేజీ కావడంతో మురుగునీరు మంచినీటిలో కలుస్తోందని, ఈ నీటిని తాగడం వల్ల అనారోగ్య బారిన పడే ప్రమాదం ఉందని వారు ఆవేదన చెందుతున్నారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.