ఆర్ద్రా నక్షత్రం పురస్కరించుకొని పూజలు

ఆర్ద్రా నక్షత్రం పురస్కరించుకొని పూజలు

విజయనగరం స్థానిక గూడ్స్ షెడ్‌ వద్ద ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యస్వామి దేవస్థానంలో ఆదివారం ఆర్ద్రా నక్షత్రం పురస్కరించుకొని విశేష పూజలు, అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించిన్నట్లు అర్చకులు కిషోర్ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఛైర్మన్ రెయ్యి శంకర్ రెడ్డి మాట్లాడుతూ.. భక్తుల కోరికల మేరకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో EO శ్రీనివాస్ పాల్గొన్నారు.