'స్వేచ్ఛ నా సందేశం' పుస్తకావిష్కరణ
VZM: విజయనగరం జడ్పీ సమావేశ మందిరంలో అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో డా.జి.వి.ఎస్ జైపాల్ రావు రచించిన "స్వేచ్ఛ నా సందేశం" పుస్తకావిష్కరణను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విమల సాహితి, జెల్ది విద్యాధర్ పుస్తకావిష్కరణ చేశారు. స్వేచ్ఛ దేశానికి అవసరమని అటువంటి స్వేచ్ఛా సందేశాన్ని జైపాల్ తన ప్రతి కవితలోను వినిపించారన్నారు.