గోడౌన్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఛైర్మన్
KMM: నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్‌లోని గిడ్డంగుల సంస్ధ గోడౌన్‌లను సంస్థ రాష్ట్ర ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్‌తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోడౌన్‌లో నిల్వ ఉన్న సన్న బియ్యం నాణ్యతను, నిల్వలను పరిశీలించారు. ఎగుమతులు, దిగుమతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. బియ్యం నిల్వల్లో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.