'రణబాలి' షూటింగ్ వీడియో లీక్..!
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ 'రణబాలి'. తాజాగా ఈ మూవీ షూటింగ్ వీడియో లీక్ అయింది. గుర్రపు స్వారీ చేస్తున్న విజయ్ 'నాకొడకా.. యాడుండువ్ రా.. నీ ఇళ్లలోకి వచ్చినా' అంటూ కత్తి పట్టుకుని తిరుగుతున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఈ చిత్రం సెప్టెంబర్ 11, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.