'జిల్లాలో అరటి రైతుల పరిస్థితి దారుణంగా ఉంది'
ATP: జిల్లాలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అరటి రైతులు కన్నీరు పెట్టుకుంటున్నా కూటమి ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కరువు కాటకాలు విలయతాండవం చేస్తాయన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించాలన్నారు.