మంత్రి లోకేష్ ప్రజాదర్బార్‌కు వెల్లువెత్తిన వినతులు
GNTR: సమస్యలతో వచ్చిన ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన 87వ రోజు ప్రజాదర్బార్‌లో ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి భారీగా వినతులు స్వీకరించారు. అందిన వినతులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు.