'ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలి'
W.G: అర్హులైన వారందరికీ ప్రభుత్వ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని జేసీ రాహుల్ అన్నారు. శనివారం భీమవరంలో అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించారు. పాత లే అవుట్లో ఖాళీగా ఉన్న ప్లాట్లను గుర్తించి వీఆర్వో లాగిన్‌లో అప్డేడేట్ చేయాలన్నారు. ఇప్పటికే పెనుగొండ, పెనుమంట్ర, అత్తిలి, పోడూరు మండలాలలో డేటా ఎంట్రీని మొదలుపెట్టడం జరిగిందన్నారు.