నిధులు మంజూరు చేయాలని మంత్రికి వినతి

JN: మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి హైదరాబాద్‌లో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని పలు రహదారుల అభివృద్ధి కోసం రూ.21 కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరుతూ వినతి పత్రం అందించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి నిధులు మంజూరు చేస్తానని అన్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.