జిల్లాలో.. ఏడుగురికి జైలు శిక్ష

NDL: జిల్లాలో ఇవాళ వాహనాల తనిఖీల్లో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన ఏడుగురికి రూ. 39 వేలు జరిమానా, 7 రోజుల జైలు శిక్ష విధించినట్లు ఏఎస్పీ జావలి తెలిపారు. ట్రాఫిక్ సీఐ మల్లికార్జున గుప్తా ఆధ్వర్యంలో జరిగిన తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడిపిన వారిని 1వ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చినట్లు పేర్కొన్నారు.