సీఎం పర్యటన రద్దు

సీఎం పర్యటన రద్దు

AP: సీఎం చంద్రబాబు ఈ నెల 7న గుంటూరులో పర్యటించనున్న విషయం తెలిసిందే. జిల్లాలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. తాజాగా ఈ పర్యటన రద్దు అయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆరోజున వేరే పనులు ఉండటంతో పర్యటన రద్దు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. శంకుస్థాపనలో సీఎంకు బదులు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొంటారని స్పష్టం చేశారు.