కౌకుంట్లలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత

MBNR: కౌకుంట్ల మండల వ్యాప్తంగా గత 24 గంటల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదు కావడంతో మధ్యాహ్నం సమయంలో ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం వేళ అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని చెబుతున్నారు.