నిర్లక్ష్యానికి నిదర్శనం.. నిరుపయోగంగా క్రీడా ప్రాంగణాలు

నిర్లక్ష్యానికి నిదర్శనం.. నిరుపయోగంగా క్రీడా ప్రాంగణాలు

SRPT: గ్రామీణ ప్రాంతాల్లో యువకులు, విద్యార్థులు ఆడుకోవడానికి ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు నిరుపయోగంగా మారాయి. కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా పలు మండలాల్లో గత ప్రభుత్వ హయాంలో ఎంతో ఆర్భాటంగా ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు నేటికి ఆటకు నోచుకోక వెలవెలబోతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపొవడంతో అస్తవ్యస్తంగా మారాయని విమర్శలు వినిపిస్తున్నాయి.