వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు దరఖాస్తుల ఆహ్వానం
అన్నమయ్య: జిల్లాలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి చంద్రశేఖర్ బుధవారం తెలిపారు. ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ సూచనల మేరకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ శిబిరాలు నిర్వహించనున్నారు. సీనియర్ క్రీడాకారులు, ఫిజికల్ డైరెక్టర్లు శిక్షణ అందించేందుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.