'పంట నష్టాన్ని పరిశీలించిన అధికారులు'

ప్రకాశం: మార్కాపురం మండలం గజ్జలకొండలో సోమవారం సాయంత్రం బలమైన ఈదురుగాలులకు 38 ఎకరాల బొప్పాయి పంట నాశనమైంది. ఈ విషయం తెలుసుకున్న అధికారులు మంగళవారం పంట నష్టాన్ని పరిశీలించి, రైతుల నుండి వివరాలు సేకరించారు. ఇప్పటికే ప్రాథమిక అంచనా వేసి పై అధికారులకు పంపించామని, రైతులకు మేలు జరిగేలా చూస్తామని వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రెడ్డి, ఉద్యాన అధికారి రమేష్ తెలిపారు.