సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే
PPM: కొమరాడ మండలం పరశురాంపురంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును బుధవారం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ రోడ్డు ద్వారా గ్రామస్తులకు రాకపోకలు సులభతరం అవుతాయని తెలిపారు. అలాగే, గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు.