సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

కోనసీమ: అంబాజీపేట మండలం కొర్లపాటి వారిపాలెం శ్రీ వనువులమ్మ గుడి వద్ద నాబార్డ్ నిధులతో రూ.1.10 కోట్ల వ్యయంతో నూతన సీసీ రోడ్డు పనులకు పి. గన్నవరం MLA గిడ్డి సత్యనారాయణ ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ రహదారి పూర్తయిన తరువాత స్థానికులు, పరిసర గ్రామాలకు రవాణా, విద్య, భక్తులకు సౌలభ్యం కలుగుతుందన్నారు. త్వరలోనే నాణ్యతతో రోడ్డు పూర్తి అవుతుందని హామీ ఇచ్చారు.