విజయవాడలో డ్రోన్ల ద్వారా నీటి తుంపర్లు
ఎన్టీఆర్: విజయవాడలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు వినూత్న చర్యగా డ్రోన్ల ద్వారా నీటి తుంపర్లు (మిస్ట్) వెదజల్లే కార్యక్రమాన్ని కలెక్టర్ జి.లక్ష్మీశ క్షేత్రస్థాయిలో గురువారం పరిశీలించారు. మహాత్మా గాంధీ రోడ్, అంబేద్కర్ స్మృతి వనం వద్ద ఈ కార్యక్రమాన్ని VMC అధికారులతో కలిసి పరిశీలించారు.