పలాసలో ఊపందుకున్న వరి కోతలు
SKLM: పలాస నియోజకవర్గ పరిధిలో వరి కోతలు ఊపందుకున్నాయి. ఇటీవల దిత్వా తుఫాన్ కారణంగా అధికారుల హెచ్చరికలతో రైతులు కొంత ఆందోళన చెందినప్పటికీ... చిన్నపాటి చినుకులు తప్ప వర్షం కురవకపోవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటికే 50% కోతలు పూర్తయినట్లు ఏవో పోలారావు తెలిపారు. వరి కోతల అనంతరం అంతర పంటలు పెసలు, మినుములు, నువ్వులు వేసేందుకు రైతులు సిద్ధపడుతున్నారు.