కబడ్డీ పోటీలను విజయవంతం చేస్తాం: ఎమ్మెల్యే
కృష్ణా: గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో అండర్ -14 జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే రాము తెలిపారు. 2026 జనవరి 19వ తేదీ నుంచి 23 వరకు జరిగే పోటీలను ఐక్యంగా పనిచేసి విజయవంతం చేస్తామని ఆయన అన్నారు.స్టేడియంలో అధికారులతో ఎమ్మెల్యే ఈరోజు సమావేశమయ్యారు. క్రీడాకారులకు సౌకర్యాలతో పాటుగా, నాణ్యమైన ఆహారం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.