వేరుశనగ పంటను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే

వేరుశనగ పంటను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే

MBNR: భూత్పూర్ మున్సిపాలిటీ సొమ్లా తండాకు చెందిన రైతు సీతారాం నాయక్ వేరుశనగ పంటను ఇవాళ మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పరిశీలించారు. సాగు వివరాలను రైతును అడిగి తెలుసుకున్నారు. రైతు భరోసా నిధులు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని రైతు సీతారాం నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎటువంటి షరతులు లేకుండా రైతులకు పెట్టుబడి సహాయం అందించాలని పేర్కొన్నారు.