రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
ప్రకాశం: తర్లుపాడు మండలం సీతానాగులవరం గ్రామంలో బుధవారం కూటమి ప్రభుత్వం నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నదాతలైన రైతుల అభివృద్ధి, సంక్షేమమే తమ కూటమి ప్రధాన లక్ష్యం అని స్పష్టం చేశారు. రైతు సంక్షేమమే ప్రధాన ద్యేయం అని రైతులు బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని అన్నారు.