'పేదల సొంతింటి కల నెరవేరుస్తాం': ఎమ్మెల్యే
PDPL: పేదల సొంతింటి కలను ప్రజా ప్రభుత్వం నెరవేరుస్తుందని ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. ఆయన ఇవాళ గోదావరిఖని 54వ డివిజన్‌లో ఇందిరమ్మ ఇంటికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అర్హులైన అందరికీ ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ ఎల్లయ్య, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.