డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ముద్దాయికి జైలు శిక్ష
NDL: కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్ వద్ద ఇవాళ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా చిన్న ఆంజనేయులు అనే వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డాడు. పోలీసులు ముద్దాయిని బనగానపల్లె కోర్టులో మెజిస్ట్రేట్ వద్ద హాజరు పరిచారు. ముద్దాయికి నెల రోజులు జైలు శిక్ష 3000 జరిమానా విధించినట్లు సీఐ రమేష్ బాబు తెలిపారు.