అక్రమ వసూళ్ల ముఠాకు చెక్

అక్రమ వసూళ్ల ముఠాకు చెక్

MBNR: జడ్చర్లలో సేవా ట్రస్టుల పేరిట అక్రమంగా చందాలు వసూలు చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదర్శ వెల్ఫేర్, అమ్మానాన్న సేవా ట్రస్ట్ పేర్లతో నకిలీ రసీదులు సృష్టించి వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేస్తుండగా, స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుల నుండి ఒక కారు, నకిలీ రసీదు పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు.