యువత ఉన్నతమైన లక్ష్యాలను ఎంచుకోవాలి: ఎస్పీ

SRPT: యువత ఉన్నతమైన లక్ష్యాలను ఎంచుకోవాలని ఎస్పీ నరసింహ అన్నారు. బుధవారం సూర్యాపేటలోని జయ పాఠశాల నందు నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అవగాహన కల్పించి మాట్లాడారు. ఆలోచనల పట్ల విద్యార్థులు స్వీయ నియంత్రణ కలిగి ఉండాలన్నారు. చెడు ఆలోచనలకు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, మాదకద్రవ్యాల నిర్మూలనలో విద్యార్థులు భాగం కావాలన్నారు.