బహిరంగంగా చెత్త.. రూ.15వేలు ఫైన్

బహిరంగంగా చెత్త.. రూ.15వేలు ఫైన్

SDPT: జిల్లా కేంద్రంలోని 3వ వార్డు రంగధాంపల్లి చౌరస్తా బైపాస్ వద్ద రోడ్డుపై చెత్త వేసిన సిద్దిపేట ఫార్మసీ మెడికల్ హాల్ వారిని వార్డ్ ఆఫీసర్ గుర్తించారు. చెత్తను వారి షాపు వద్దకు తీసుకువచ్చి రూ.15 వేల జరిమానా విధించారు. బహిరంగంగా చెత్త వేస్తే జరిమానా తప్పదని మున్సిపల్ అధికారులు హెచ్చరించారు.