స్వాతంత్య్ర సమరయోధురాలు కన్నుమూత
ఖమ్మం: సింగరేణి మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన 94 ఏళ్ల స్వాతంత్య్ర సమరయోధురాలు భాగం తులసమ్మ ఇవాళ ఉదయం తన నివాసంలో తుది శ్వాస వదిలారు. స్వాతంత్య్ర పోరాటంలో తన భర్త వెంకటప్పయ్య కీలకపాత్ర వహించారు. నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆమె మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.