కోయిలకుంట్లలో పర్యటించిన బీసీ ఇందిరమ్మ
NDL: కోయిలకుంట్ల పట్టణంలో ఇవాళ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ పర్యటించారు. పట్టణ టీడీపీ నాయకుడు కరిమద్దెల మురళి ఆహ్వానం మేరకు బీసీ ఇందిరమ్మ సుంకులమ్మ మొక్కుబడి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆమె సుంకులమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు.