‘UAEలో భారతీయుల రక్షణే మా ప్రాధాన్యత’

‘UAEలో భారతీయుల రక్షణే మా ప్రాధాన్యత’

పశ్చిమ ఆసియాలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో UAEలో నివసిస్తున్న భారతీయుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్ వెల్లడించారు. ప్రవాస భారతీయులకు ఏ కష్టం వచ్చినా అండగా ఉండేందుకు రాయబార కార్యాలయం సిద్ధంగా ఉందని ఆయన భరోసా ఇచ్చారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని, ఎవరూ ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు.