జబ్బార్ బస్సు బోల్తా.. ఒకరు మృతి

జబ్బార్ బస్సు బోల్తా.. ఒకరు మృతి

సత్యసాయి: చేన్నేకొత్తపల్లి మండలం దామాజిపల్లి సమీపంలో మంగళవారం ఉదయం జబ్బార్ ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఒక మహిళ మృతి చెందగా, 8 మంది గాయపడ్డారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సుకు ఐచర్ వాహనం అడ్డురావడంతో డ్రైవరు అదుపు కోల్పోయినట్లు తెలుస్తోంది. బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.