పరకామణిపై జగన్ వ్యాఖ్యలు విడ్డూరం: బుద్ధా
AP: పరకామణిపై జగన్ వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. దొంగను జగన్ ఎందుకు వెనకేసుకొస్తున్నారని ప్రశ్నించారు. రూ.లక్ష కోట్లు దోచుకున్న వాళ్లకు ఈ కేసు చిన్నదే అని దుయ్యబట్టారు. శ్రీవారి భక్తుల మనోభావాలను జగన్ కించపరిచారని మండిపడ్డారు. సిట్ విచారణలో అన్నీ బయటకు వస్తాయని పేర్కొన్నారు.