VIDEO: గిరిజనుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: ఎంసీపీఐయూ
NRML: ఖానాపూర్ మండలంలోని బీర్నంది, తుమ్మగూడెం గ్రామాలలో శనివారం ఎంసీపీఐయూ నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మల్లెపు పీటర్, సురేష్ మాట్లాడుతూ.. 40 ఏళ్లుగా నివాసం ఉన్న గిరిజనులకు రోడ్లు, డ్రైనేజీలు వంటి కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. అధికారులు తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.