భల్లూకాలతో భయం.. రంగంలోకి సైన్యం!

భల్లూకాలతో భయం.. రంగంలోకి సైన్యం!

జపాన్ అకిటా రాష్ట్రంలో ఎలుగుబంట్ల దాడులు పెరగడంతో అక్కడి ప్రభుత్వం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. ఇందుకోసం సైనిక బృందాలను రంగంలోకి దింపింది. వేటగాళ్లతో పాటు సైన్యం బోన్లను ఆయా ప్రదేశాలకు తరలించడం, భల్లూకాల కళేబరాలు తీసుకెళ్లడంలో సైనికులు సాయపడతారని రక్షణశాఖ తెలిపింది. ఈ ఆపరేషన్‌లో తుపాకులు మాత్రం ఉపయోగించరని వెల్లడించింది.