గుండెపోటుతో మహిళ మృతి

JGL: బీర్పూర్ మండలం తుంగూరు గ్రామానికి చెందిన పిట్టల శోభ అనే మహిళ ఆదివారం గుండెపోటుతో మృతి చెందింది. శోభ భర్తను కోల్పోయి ఒంటరిగా జీవిస్తుంది. తీవ్ర మానసిక వేదనకు లోనైనా శోభ గుండెపోటుకు గురవడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆమె మృతి చెందింది. దీంతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.