లబ్ధిదారులకు గృహ మంజూరు పత్రాలు అందజేత
ATP: తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి నందలపాడులో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం కింద ఎంపికైన 32, 33, 34 వార్డుల లబ్ధిదారులకు ప్రగతి పాఠశాలలో గృహ మంజూరు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.