లావాదేవీలు లేని బ్యాంకులలో 82.66 కోట్లు: కేశవ శర్మ

లావాదేవీలు లేని బ్యాంకులలో 82.66 కోట్లు: కేశవ శర్మ

కోనసీమ: జిల్లాలోని వివిధ బ్యాంకుల్లో 4,70,690 లావాదేవీ లేని ఖాతాల్లో రూ.82.66 కోట్లు నిల్వ ఉన్నాయని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ కేశవ వర్మ తెలిపారు. అమలాపురం లో ఆయన మాట్లాడుతూ.. సరైన ధృవపత్రాలతో ఈ కేవైసీ పూర్తి చేస్తే తమ సొమ్మును తిరిగి పొందవచ్చన్నారు. మీ డబ్బు-మీ హక్కు’ ప్రచార కార్యక్రమం భాగంగా డిసెంబర్ 5న కలెక్టరేట్ వద్ద శిబిరం పెడుతున్నామన్నారు.